Eatala: ఈసారి ముదిరాజ్‌ల దెబ్బంటో చూపిస్తాం.. సీఎం కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
బీఆర్ఎస్ లిస్టులో ముదిరాజ్‌లకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడాన్ని ఈ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకిస్తోంది..
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ లిస్టులో ముదిరాజ్‌లకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడాన్ని ఈ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామని ఆ సామాజిక వర్గం నేతలు అంటున్నారు. అటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో ాాదాదాపు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ముదిరాజ్‌లు శాసిస్తారని.. అటువంటి సామాజిక వర్గానికి సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో ముదిరాజ్‌ల ఓట్లతో గెలిచారని గుర్తు చేశారు. ముదిరాజ్ తల్లి పాలు తాగానని చెప్పే సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆ సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని మండిపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు ముదిరాజ్ బిడ్డలు సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ హెచ్చరించారు.