తెలంగాణ ఏర్పాటు ఫలాలు KCR కుటుంబం మాత్రమే అనుభవిస్తోంది: Assam CM Himanta Biswa Sarma
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు కేవలం ఒక్క ఫ్యామిలీ మాత్రమే అనుభవిస్తోందని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు.....Assam CM Hits out at CM KCR
దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు కేవలం ఒక్క ఫ్యామిలీ మాత్రమే అనుభవిస్తోందని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. వినాయక నిమజ్జనోత్సవాలలో భాగంగా ఎంజే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుండి ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఒక్క ఫ్యామిలీకే మంచి జరుగుతోందని, మిగిలిన అన్ని కుటుంబాలకు మంచి జరిగేలా చూడాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన రజాకార్ల పాలనను తలపిస్తోందని, కేసీఆర్ పాలన నుండి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. సర్కార్ అంటే ప్రజలందరి కోసమని.. కేవలం ఒక్క కుటుంబం కోసమే కాదన్నారు.