సమగ్రాభివృద్ధికే హై-సిటీ

గ్రేటర్ హైదరాబాద్‌లో మౌలిక వసతులను మెరుగుపరచటంతో పాటు సిటీకి ఉన్న అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్‌ను కొనసాగించాలన్న సంకల్పంతోనే సర్కారు హై సిటీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు గుర్తు చేశారు.

Update: 2024-07-04 03:06 GMT

దిశ, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో మౌలిక వసతులను మెరుగుపరచటంతో పాటు సిటీకి ఉన్న అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్‌ను కొనసాగించాలన్న సంకల్పంతోనే సర్కారు హై సిటీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు గుర్తు చేశారు. బుధవారం జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల అధికారులతో కమిషనర్ అంతర్గతంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలోనూ వివిధ వ్యూహాత్మక పథకాల పేరుతో గ్రేటర్ ప్రజలకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అట్టి వ్యూహాత్మక పథకాలు ఎస్ఆర్ డీపీ, ఆర్డీపీ, ఎస్ఆర్డీపీ, సీఆర్‌ఎంపీ ద్వారా గ్రేటర్‌లో చేపట్టిన అసంపూర్తి పనులు పూర్తి చేయడం, నూతన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

వివిధ పథకాల కింద చేపట్టనున్న అభివృద్ధి పనులన్ని నిర్వహించేందుకు గాను ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పథకమే హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ ఫార్మేటివ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్) గా ఆమె వివరించారు. గతంలో చేపట్టిన పనులు పూర్తవ్వడానికి కావాల్సిన నిధులు, ఇప్పుడు అవసరమైన ప్రాధాన్యత గల పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీని ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు. గతంలో జీహెచ్ఎంసీలో మెరుగైన రవాణా వ్యవస్థ, సిగ్నల్ ఫ్రీ నగరంగా ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలు, అండర్ పాస్‌లు, ఇతర రోడ్ల విస్తరణ అభివృద్ది కోసం 42 పనులు చేపట్టగా, అందులో 35 పనులు పూర్తి అయ్యాయని, మరో 7 పనులు వివిధ దశల్లో ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు.

పథకాల వారీగా..

ఎస్ఎన్ డీపీ మొదటి దశలో జీహెచ్ఎంసీతో పాటుగా సిటీని ఆనుకొని ఉన్న మున్సిపాల్టీలను కలుపుకొని మొత్తం 58 పనులు చేపట్టగా, అందులో 39 పనులు పూర్తి చేసినట్లు, మొత్తం 69.49 కిలోమీటర్ల పొడవు సామర్థ్యం గల నాలా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 42.48 కిలోమీటర్ల నాలాను పూర్తి చేసినట్లు వెల్లడించారు. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 37 పనులు చేపట్టగా, 30 పనులు పూర్తిచేశామన్నారు. ఇంకా ఏడు పనులు, వివిధ ఇతర మున్సిపాల్టీల్లో 7 పనులు, మిగితా మున్సిపాలిటీలలో 12 పనులు అసంపూర్తిగా ఉన్నట్లు తెలిపారు. నాలా అభివృద్ధికి (ఎస్ఎన్డీపీ) ద్వారా రెండో దశలో చేపట్టేందుకు ప్రతిపాదించిన పనుల్లో రూ.582.42 కోట్ల అంచనా వ్యయంతో 35 పనులు ప్రభుత్వం హై సిటీ కార్యక్రమం ద్వారా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీల ద్వారా చేపట్టిన పనుల్లో అసంపూర్తిగా మిగిలిన వాటిని పూర్తి చేయడమే హై సిటీ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. హై సిటీకి కింద వివిద ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఎల్ బి నగర్ జోన్ లో..

కాప్రా సర్కిల్ వార్డు నెం.1 లో వీఐపీ గోడౌన్, కృష్ణ నగర్ నుండి ఏకలవ్య నగర్ మీదుగా సాకేత్ ఆదర్శ్ నగర్ కల్వర్టు వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం, పెద్ద చెరువు (నాచారం) నుండి నల్ల చెరువు (ఉప్పల్) వరకు వరద నీటి కాలువను నిర్మించనున్నట్లు తెలిపారు. రెడ్డి కాలనీలో డీ-మార్ట్ నుండి జేఎస్ రెడ్డి స్విమ్మింగ్ పూల్ వరకు ఉన్న డ్రెయిన్ రీమోడలింగ్ చేసే పనులతో పాటు తిరుమల హాస్పిటల్ నుండి సాగర్ రింగ్‌రోడ్ జంక్షన్ వరకు వరద నీటి కాలువ నిర్మాణం, రామంతపురం చెరువు నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు వరద నీటి కాలువ నిర్మాణం, కేకే గార్డెన్స్ నుండి వందనాపురి కాలనీ వరకు వరద నీటి కాలువ నిర్మాణం, ఈసీ నగర్ నుండి రాంపల్లి సరస్సు వరకు వరద నీటి కాలువలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చార్మినార్ జోన్ లో..

డబీర్‌పుర దర్వాజ నుండి ఫర్హత్‌నగర్ నాలా వరకు వరద నీటి కాలువ నిర్మాణం, అరోరా కాలేజ్ వెనుక నుండి మన్మణి కుంట వరకు వరద నీటి కాలువ నిర్మాణం,మౌలా-కా-చిల్లా నుండి గంగా నగర్ మీదుగా హైదరాబాద్ ఇస్లామిక్ స్కూల్ వరకు ఉన్న ఓపెన్ డ్రెయిన్ బ్యాలెన్స్ పనులను హై సిటీ కింద చేపట్టాలని నిర్ణయించారు. యాఖుత్‌పురా వద్ద చోటా వంతెన నుండి అమన్ నగర్ తాలబ్‌కట్ట వరకు టన్నెలింగ్ నిర్మాణం, బార్కాస్ డివిజన్ పరిధిలోని మన్మణి కుంట నుండి మిల్లత్ నగర్ వరకు వరద నీటి కాలువ నిర్మాణం, మిల్లత్ నగర్ నుండి బిస్మాయిల్లా కిరాణా స్టోర్ వరకు వరద నీటి కాలువ నిర్మాణం, బిస్మిల్లా కిరాణా స్టోర్ నుండి గౌస్ నగర్ వద్ద అలీ హోటల్ వరకు వరద నీటి కాలువను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.

మౌలా-కా-చిల్లా నుండి గంగా నగర్ మీదుగా హైదరాబాద్ ఇస్లామిక్ స్కూల్ వరకు ట్విన్ బాక్స్ డ్రెయిన్ వరకు ఉన్న ఓపెన్ డ్రెయిన్‌ను పునర్ నిర్మించే పనులు చేపట్టాలని నిర్ణయించారు. బండ్లగూడ జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ కాలనీ నుంచి ఎర్రకుంట వరకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణం, సన్నీ గార్డెన్ నుండి శివాజీ నగర్ వరకు ముర్కి నాలా(పిల్లర్ నెం.8)కి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం, నూరమ్మ చెరువు నుండి ప్రభాకర్జీ కాలనీ మీదుగా శివరాంపల్లి చెరువు ఊర చెరువు మీదుగా మీరాలం ట్యాంక్ వరకు రిటైనింగ్ వాల్, కల్వర్టులను నిర్మించే ప్రతిపాదన, అరుంధతి నగర్ నుండి అక్బర్ నగర్ పైకి 9.90 9.90 వరకు ఖాళీ భాగాలలో ముర్కీ నాలా (పిల్లర్ నెం.9)లో రిటైనింగ్ వాల్ నిర్మాణం, మజిద్ కిరణా స్టోర్ వద్ద కిషన్ బాగ్ రోడ్ క్రాసింగ్ నుంచి మూసీ నది వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రాధాన్యతకు తగిన విధంగా పెంచుతూ నిర్మించాలని ప్రతిపాదించారు.

ఖైరతాబాద్ జోన్ లో..

కొత్త సర్కారు ప్రవేశపెట్టిన హై సిటీ కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనుల వివరాలిలా ఉన్నాయి. న్యూ ప్రగతి ప్రెస్, లక్డికాపూల్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు వరద నీటి కాలువను నిర్మించాలని నిర్ణయించారు. ఉస్మానియా జెన్ హాస్పిటల్ నుంచి మూసీ నది వరకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణం. ఆదర్శ్ నగర్ నుండి పాత/కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు వరద నీటి కాలువ నిర్మాణం. వెస్ట్రన్ ప్లాజా నుండి లిమ్రా కేఫ్ వరకు వరదనీటి కాలువ నిర్మాణం.

శేరిలింగంపల్లి జోన్ లో..

గఫూర్ నగర్ జంక్షన్ నుండి దుర్గం చెరువు ఎంట్రీ ప్లాజా వరకు ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణం. పటేల్ చెరువు నుండి గంగారం చెరువు వరకు ఓపెన్ డ్రెయిన్ నిర్మాణం. బండ్లగూడ చెరువు నుంచి తిమ్మక్క చెరువు వరకు స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం. గురునాథ్ చెరువు నుండి పటేల్ చెరువు వరకు ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణం.బెడ్, సైడ్ వాల్స్‌తో ఓపెన్ డ్రెయిన్ నిర్మాణం నల్లగండ్ల మిగులు నుండి నేతాజీ నగర్ వరకు, అంబేద్కర్ కాలనీ నుండి శిశు మందిర్ ప్రాంతం (తిమ్మక చెరువు) వరకు వరద నీటి కాలువ నిర్మాణం. జనార్దన్ హిల్స్ నుండి యూరో కిడ్స్ స్కూల్/ ఖాజాగూడ పెద్ద చెరువు వరకు కాలువ నిర్మాణం ప్రతిపాదనలను సిద్దం చేశారు.

కూకట్ పల్లి జోన్ లో

.సున్నం చెరువు నుండి మైసమ్మ చెరువు వరకు వరద నీటి కాలువ నిర్మాణం (కాముని చెరువు మిగులు నాలాతో సహా), మైసమ్మ చెరువు నుండి దీనదయాళ్ నగర్ వరకు వరద నీటి కాలువ నిర్మాణం, కూకట్‌పల్లి బస్ డిపోలో ఐడీఎల్ మిగులు నుండి కూకట్‌పల్లి నాలా వరకు వరద నీటి కాలువ నిర్మాణం. కూకట్‌పల్లి బస్ డిపో నుండి గౌతమ్ నగర్ వరకు వరద నీటి నిర్మాణం. ప్రేమ్ సరోవర్ అపార్ట్‌మెంట్లలో పార్కి చెరువు నుండి కూకట్‌పల్లి నాలా వరకు నాలా పునర్ నిర్మించే ప్రతిపాదనను త్వరలోనే అమలు చేయనున్నారు. మానస సరోవర్ నుండి కల్వర్ట్ వరకు నాలా పునర్ నిర్మాణానికి ప్రతిపాదన.

సికింద్రాబాద్ జోన్‌లో..

సికింద్రాబాద్ జోన్, ముషీరాబాద్ సర్కిల్, రామ్ నగర్ వార్డు నంబర్ 87, రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని ప్రకాష్ నగర్ నుండి అచియా లేఅవుట్, ప్రకాష్ నగర్ విస్తరణ నుండి అర్కా మసీదు వరకు కూకట్‌పల్లి నాలాకు అనుసంధానం చేయడం ద్వారా నీటి కాలువను అందించడ. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి నారాయణగూడ వంతెన వరకు పైప్‌లైన్ వేయడం ద్వారా స్టార్మ్ వాటర్ డ్రెయిన్‌ను పునర్నిర్మించడం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న నీటి స్తబ్దతను తొలగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నేరెడ్‌మెట్ మల్కాజిగిరి సర్కిల్, వార్డు 136లో సాయి ఎన్‌క్లేవ్ కరెంట్ ఆఫీస్ నుండి ఎంప్లాయ్ కాలనీ వద్ద బాక్స్ డ్రెయిన్ నిర్మాణం. మల్కాజిగిరి సర్కిల్ 28, మల్కాజిగిరి 140 వ వార్డులో గౌతమ్ మోడల్ స్కూల్ నుండి రాజీవ్ గాంధీ నగర్ ఆర్ యూబీ వరకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణం. వార్డు నెం.138, సర్కిల్‌లోని ఆర్టీసీ కాలనీలో బండ చెరువు నుండి ప్రధాన రహదారి వరకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణ ప్రతిపాదనలను సిద్ధం చేశారు.


Similar News