తెలుగు వాళ్లందరూ కలిసిమెలిసి ఉండాలి

తెలుగు వాళ్లందరూ ఎక్కడ ఉన్నా కలిసిమెలిసి ఉండాలని, మన తెలుగు సాంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సినీ నటుడు సుమన్ అన్నారు.

Update: 2024-09-06 16:12 GMT

దిశ, రవీంద్రభారతి : తెలుగు వాళ్లందరూ ఎక్కడ ఉన్నా కలిసిమెలిసి ఉండాలని, మన తెలుగు సాంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సినీ నటుడు సుమన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా గిరీష్ ఇయ్యపు (అమెరికా) ఎన్నికైన సందర్భంగా సంపూర్ణ తూర్పు కాశీ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ పీఠాధిపతి వరసిద్ధి వరప్రసాద్ ఆశీస్సులతో ఘంటసాల ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో డా. టి. శరత్ చంద్ర సమర్పించిన ఆత్మీయ అభినందన సత్కార సభ రవీంద్రభారతిలో జరిగింది.

     శరత్ చంద్ర స్వర సారథ్యంలో ఘంటసాల స్వరామృతధార సంగీత కార్యక్రమంలో ఘంటసాల గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ప్రముఖ రచయిత సాయి మాధవ్, ముఖ్య అతిథులుగా వరసిద్ధి వరప్రసాద్, వంశీ రామరాజు, గజల్ శ్రీనివాస్, శివారెడ్డిలు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం సన్మాన గ్రహీత గిరీష్ ఇయ్యపును సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు పి. నాగేశ్వరరావు, ఘంటసాల గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ సీఈఓ శివరమ్య ధరణి ప్రగడ, శ్రీరామ్, విజయ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News