ఐదో అంతస్తుపై నుంచి దూకి సాఫ్టువేర్ ఉద్యోగి ఆత్మహత్య
భవనం ఐదో అంతస్తుపై నుంచి దూకి సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకొన్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, మియాపూర్: భవనం ఐదో అంతస్తుపై నుంచి దూకి సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకొన్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ యాదగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంకు చెందిన సంతోష్ రాజు (26), హఫీజ్ పేట్ లోని దేవి హోమ్స్ లో నివాసం ఉంటూ సాఫ్టువేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సంతోష్ రాజుకు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో బాధపడగా గొంతుకు సంబంధిత శస్త్ర చికిత్స జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో మరిన్ని అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సమయంలో భవనంలోని ఐదో అంతస్తు నుంచి కిందికి దూకడంతో తీవ్ర గాయాలై ఘటన స్థలంలోనే మరణించాడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం కేవలం అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.