వైద్యం వికటించి వ్యక్తి మృతి.. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన

కాలికి శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రి వెళితే వైద్యుల నిర్లక్ష్యంతో

Update: 2024-09-13 15:02 GMT

దిశ, ఖైరతాబాద్ : కాలికి శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రి వెళితే వైద్యుల నిర్లక్ష్యంతో మనిషినే చంపేశారు అంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కాలుకు గాయమైందని రాజయ్య అనే వ్యక్తి 7 రోజుల క్రితం అమీర్ పెట్ వెల్నెస్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు శాస్త్ర చికిత్స చేసి కాలుకు సర్జరీ చేశారు. ఆరోగ్యం కుదుటపడింది మరుసటి రోజు డిశ్చార్జి చేస్తామని చెప్పారు.

తర్వాత వ్యక్తి సీరియస్ కండిషన్ లోకి వెళ్లాడని చెప్పారు. వెళ్లి చూస్తే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతి చెందాడు. రూ. 5లక్షలు చెల్లిస్తే నే డెడ్ బాడీని ఇస్తామని యాజమాన్యం డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ కుటుంబ సభ్యులు యాజమాన్యం పై చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.


Similar News