కిలో చామంతి @200

వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో వ్యాపారులు రెండింతల ధర పెంచారు.

Update: 2024-09-06 14:01 GMT

దిశ,కార్వాన్ : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో వ్యాపారులు రెండింతల ధర పెంచారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని భారీ స్థాయిలో వివిధ రాష్ట్రాలతో పాటు వికారాబాద్, శంకర్ పల్లి నుంచి బంతి, చామంతి, గులాబి, వివిధ రకాల పూలు వచ్చాయి. సాధారణ సమయంలో బంతి ధర కిలో 30 నుంచి 50 రూపాయలు ఉండగా నేడు 100 రూపాయలపైనే విక్రయించారు. అంతే కాకుండా కిలో చామంతి 150 నుంచి 200 పైనే అమ్మగా, గులాబి 200 నుంచి 300 వరకు అమ్మారు.

    అయితే పండుగ రోజున పూల ధరలు రెట్టింపు కావడం సాధారణమేనని మార్కెట్ కు వచ్చిన వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రాంతం నుండి కాకుండా శంషాబాద్ నుండి సైతం వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. వినాయకుడికి సమర్పించే పూపత్రి కూడా 15 రకాలు 100 రూపాయలకు విక్రయించారు. వివిధ ప్రాంతాల నుంచి బంతిపూలను తీసుకొచ్చిన వాహనాలతో ట్రాఫిక్​ కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొనుగోలుదారులు వాపోయారు. అంతే కాకుండా మార్కెట్ లోని లోడింగ్, ఆన్లోడింగ్, వాహనాలు మార్కెట్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురికావల్సింది వస్తుందని, కనీసం వాహనాల పార్కింగ్ కు కూడా సదుపాయం లేదని మండి పడ్డారు. 

Tags:    

Similar News