చిల్డ్రన్ హాస్పిటల్‌లో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి

Update: 2023-03-27 11:59 GMT

దిశ, కార్వాన్: వైద్యుల నిర్లక్ష్యం వల్ల 2 నెలల పసికందు మృతి చెందిన ఘటన నాంపల్లి లో చోటు చేసుకుంది. వివరాల్లో్కి వెళితే.. నల్లగొండ జిల్లా మనిమిద్ద గ్రామానికి చెందిన మల్లేశం కు 2 నెలల క్రితం బాబు జన్మించాడు. అయితే పుట్టిన నెల రోజులకే నిమోనియా సోకడంతో.. ఆ సమస్యతో బాధపడుతున్న 2 నెలల బాబును చికిత్స కోసం 15 రోజుల క్రితం కుటుంబ సభ్యులు నాంపల్లి లోని కృష్ణ ఆసుపత్రిలో చేర్పించారు.


వైద్యం అందించి బాబును 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పి 15 రోజులు గా వైద్యులు ప్రతి రోజు వైద్యం అందిస్తున్నామని చెపుతూ.. కాలం గడిపారని బాధితులు తెలిపారు. 15 రోజులు గడిచాక బాబు మృతి చెందాడని చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా 3 లక్షల రూపాయలు కడితేనే బాబు మృతదేహాన్ని ఇస్తామని, ఆసుపత్రి యాజమాన్యం తమ మామ ఎంఎల్‌సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అని రాజకీయంగా ఆర్థికంగా పలుకుబడి ఉందని బెదిరిస్తున్నారని బాధిత తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్షం వల్లే చనిపోయాడని బందువులు ఆరోపించారు. దీంతో తమ బాబు మృతికి కారణమైన ఆసుపత్రి యాజమాన్యం వైద్యుల పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు.

Tags:    

Similar News