ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-05-13 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఉదయం మెట్రో డైలీ 6 గంటలకు స్టార్ట్ అవుతుండగా మే 14న ఉదయం 5.30 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల సౌకర్యమే తమ ప్రియారిటీ అని తెలిపింది. కాగా, శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లారు. వారంతా ఈ రోజు సాయంత్రానికి తిరుగుప్రయాణం అయ్యే చాన్స్ ఉంది. ఉదయం త్వరగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలనుకునే వారికి మెట్రో టైం పొడగింపుతో కొంత మేరకు ఉపశమనం కలగనుంది. 


Similar News