హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 11 కోట్ల మంది మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2022-12-17 14:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 11 కోట్ల మంది మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కొంత మంది కాలేజీ విద్యార్థులు డ్రగ్స్ కల్చర్ కు అలవాటు పడ్డారని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. పదేళ్ల క్రితం ర్యాగింగ్ కు వ్యతిరేకంగా కళాశాలల్లో కమిటీలు వేశామని వాటి సాహాయంతో ర్యాగింగ్ భూతాన్ని విద్యా సంస్థల నుంచి తరిమి కొట్టగలిగామన్నారు. ఇదే స్ఫూర్తితో మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆయన కాలేజీల్లో జరిగే ఘటనలకు వాటి యజమాన్యాలే బాధ్యత వహించాలని సూచించారు. అలాగే విద్యార్థినులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు త్వరలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురాబోతోందని తెలిపారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..