HYD : ఓయూలో మరోసారి నాగుపాము కలకలం

ఉస్మానియా మరోసారి నాగుపాము కలకలం రేపింది.

Update: 2024-06-20 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా మరోసారి నాగుపాము కలకలం రేపింది. న్యూ పీజీ హాస్టల్ వద్ద ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే స్థలంలో నాగుపాము కనిపించింది. పడగవిప్పి బుసలు కొడుతూ ఓ బైక్ వద్ద నాగు పాము ప్రత్యక్షం అవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవాళ్లు ఉలిక్కిపడ్డారు. కొంత మంది పామును దగ్గర నుంచి ప్రమాదకరంగా వీడియో తీశారు. కాగా, కొన్ని నెలల కిందట పాముకాటుతో ఓయూ ఉద్యోగి మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి నాగుపాము కనిపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం నాగుపాము బుసలు కొడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Similar News