HYD: పెట్టుబడితో లాభాలంటూ కుచ్చుటోపి

తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలంటూ నేరెడ్మేట్‌కు చెందిన ఓ వ్యక్తిని నిలువునా ముంచింది ఓ మాయలాడి.

Update: 2023-03-29 06:29 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలంటూ నేరెడ్మేట్‌కు చెందిన ఓ వ్యక్తిని నిలువునా ముంచింది ఓ మాయలాడి. ఆలస్యంగా మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నేరెడ్మేట్ వాసి శ్రీహరికి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ తరువాత నేను చెప్పిన పథకాల్లో తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించింది. ఇలా విడతల వారీగా రూ.28 లక్షలు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేయించింది. ఆ తరువాత కాంటాక్టులో లేకుండా పొయ్యింది.

Tags:    

Similar News