HYD : చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

హైదరాబాద్‌లో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

Update: 2024-05-28 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. సేవ్ చేసిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాల చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా ఆగడాలు బయటపడ్డాయి. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్లు గుర్తించారు. ఫిర్జాదిగూడలో రూ.4.5 లక్షలకు శిశువును ఆర్ఎంపీ శోభారాణి విక్రయించారు. ఆర్ఎంపీ, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా అరెస్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  


Similar News