HYD: కొంపల్లిలో వ్యక్తి హల్చల్.. భార్య కొడుతోందంటూ ఆత్మహత్యాయత్నం (వీడియో వైరల్)
సాధారణంగా భర్త కొడుతున్నాడంటూ భార్యలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడతారు.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా భర్త కొడుతున్నాడంటూ భార్యలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడతారు. కాస్త ధైర్యం ఉన్నోళ్లు అయితే.. తమ పుట్టింటోళ్లకు సమాచారం అందజేసి పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు మహిళలు ఏకంగా పోలీస్ స్టేషన్ గృహహింస కేసు పెట్టి భర్తను పోలీస్ స్టేషన్లో వేయిస్తారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సీన్ రివర్స్ అయింది. కొంపల్లిలో నివాసం ఉండే నగేశ్ తన భార్య నిత్యం కొడుతోందంటూ ఇవాళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొంపల్లి ప్రాంతంలో ఉన్న జయభేరి పార్క్ చేరువులోకి దిగి నాకు భార్య నుంచి విడాకులు ఇప్పించండి.. లేకపోతే చచ్చిపోతానంటూ కేకలు వేశాడు. పిల్లలను కూడా తన వద్దకు రానివ్వట్లేదని, ఎందుకు ఈ జీవితం అంటూ తన బాధను వెల్లగక్కాడు. దీంతో గమనించి స్థానికులు నగేష్‌కు నచ్చజెప్పి చెరువులోంచి తాడు వేసి బయటకు తీసుకొచ్చారు. అయితే, అందుకు సంబంధించిన ప్రస్తుతం వీడియో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది.