Hyderabad rains: కుండపోత వర్షం.. నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

మూడు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

Update: 2023-07-20 12:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: మూడు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాలతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వర్షంలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా హైదరాబాద్ లో పలుచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జీహెచ్‌ఎంసీ అలర్ట్ అయింది.

శిథిలావస్థ భవనాల్లో ఉంటున్న వారిని యుద్ధప్రతిపాదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ టీమ్ లను జీహెచ్ ఎంసీ ఏర్పాటు చేసింది. వాటర్ లాగింగ్ 24 గంటలు చేసేలా సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఐకియా, మాదాపూర్, మైండ్ స్పేస్ హైటెక్ సిటీ, కొండాపూర్ ఏరియాల్లో ట్రాఫిక్ స్తంభించింది.జేఎన్‌టీయూ, సికింద్రాబాద్, బేగంపేట్ లలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.  ఎన్‌ఎండీసీ, మాసబ్ ట్యాంక్, మహవీర్ ఆస్పత్రి, ఆసీఫ్ నగర్, సైఫాబాద్‌లలో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది.. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు ఇరుక్కుపోయాయి.  

Tags:    

Similar News