HYD : నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై అత్యాచార యత్నం
మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటన అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌కు చెందిన మహిళ శనివారం యాప్రాల్ నుంచి ఆటోలో అల్వాల్‌కు వచ్చింది. అయితే ఇద్దరు వ్యక్తులు ఆమెను ఆటోలో నుంచి కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. మహిళ చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.