HYD : అసెంబ్లీ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్ల యత్నం (వీడియో)

జీహెచ్‌ఎంసీలో పనులు చేపట్టాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.

Update: 2023-02-10 05:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి బీజేపీకి చెందిన జీహెచ్ఎంపీ కార్పొరేటర్లు యత్నించారు. జీహెచ్ఎంసీలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో జీహెచ్ఎంసీకి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీకి రావాల్సిన మొండిబకాయలు, నిధులు విడుదల చేయాలని నిరసన తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు. అత్యధిక ఆదాయం కలిగిన హైదరాబాద్‌కి ముష్టి రూ.30 కోట్ల నిధులు కేటాయించారని మండిపడ్డారు. దీంతో, గన్‌పార్క్ దగ్గర కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల కోసం నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అరెస్టు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము చేసే నిరసన మీకోసమే కదా అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. అనంతరం పోలీసులు బీజేపీ కార్పొరేటర్లను అరెస్టు చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..