HYD : ప్రేమజంట ఆత్మహత్య కలకలం

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Update: 2023-05-15 06:07 GMT
HYD : ప్రేమజంట ఆత్మహత్య కలకలం
  • whatsapp icon

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పెళ్లికి పెద్దవాళ్లు అంగీకరించలేదో మరెమైనా కారణమో తెలియదుగానీ ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం కేపిహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన శ్యామ్, జ్యోతి ఒకరంటే మరొకరు ఇష్టపడ్డారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ కొన్ని రోజుల క్రితం కేపిహెచ్బీహౌసింగ్ బోర్డు కాలనీ 7వ ఫేస్ లో ఉంటున్న స్నేహితుని వద్దకు వచ్చి అతని రూంలోనే ఉంటున్నారు. సోమవారం ఉదయం స్నేహితుడు పెళ్లికి వెళ్లి వస్తా అని చెప్పి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో శ్యామ్, జ్యోతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తిరిగి వచ్చిన స్నేహితుడు ఇది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Tags:    

Similar News