వృక్ష విలాపం..! ఒక్క వర్షం.. నేల కూలిన వంద‌లాది చెట్లు

భారీ వ‌ర్షంతో ములుగు జిల్లా ఏజెన్సీలో వేలాది చెట్లు నేలకూలాయి. వ‌రంగ‌ల్‌-ఏటూరునాగారం జాతీయ ర‌హ‌దారి 163పై వంద‌లాది చెట్లు విరిగిపడ్డాయి.

Update: 2024-09-01 07:14 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : భారీ వ‌ర్షంతో ములుగు జిల్లా ఏజెన్సీలో వేలాది చెట్లు నేలకూలాయి. వ‌రంగ‌ల్‌-ఏటూరునాగారం జాతీయ ర‌హ‌దారి 163పై వంద‌లాది చెట్లు విరిగిపడ్డాయి. అలాగే తాడ్వాయి మండ‌లంలోని మేడారం ర‌హ‌దారిపైనా వంద‌ల సంఖ్య‌లో చెట్లు నేలమట్టమయ్యాయి. శ‌నివారం రాత్రి నుంచి చెట్లు నేల‌కూలుతూనే ఉన్నాయి. రోడ్ల‌పై ప‌డిన చెట్ల‌ను ఓ వైపు తొల‌గిస్తుండ‌గానే మ‌రోవైపు మ‌రికొన్ని ఒరిగిపోతున్నాయి. రోడ్డును క్లియ‌ర్ చేసేందుకు అధికారుల‌కు ప్ర‌హాస‌నంగా మారింది. గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా వంద‌ల సంఖ్య‌లో నేల‌కూల‌డంపై ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, ఆదివాసీలు, గిరిజ‌నులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 


Similar News