భారీ మందుపాతర లభ్యం.. నిర్వీర్యం చేసిన బాంబ్డిస్పోజల్స్క్వాడ్
పోలీసులను లక్ష్యంగా చేసి ఏర్పాటు చేసిన భారీ మందుపాతరను బీజాపూర్పోలీసులు బుధవారం నిర్వీర్యం చేశారు. దీనిని కనుక్కోక పోయి ఉన్నట్టయితే మావోయిస్టుల పథకం ఫలించి రక్తపాతం జరిగి ఉండేదని జిల్లా పోలీసు అధికారులు పేర్కొన్నారు.
దిశ తెలంగాణ క్రైం బ్యూరో : పోలీసులను లక్ష్యంగా చేసి ఏర్పాటు చేసిన భారీ మందుపాతరను బీజాపూర్పోలీసులు బుధవారం నిర్వీర్యం చేశారు. దీనిని కనుక్కోక పోయి ఉన్నట్టయితే మావోయిస్టుల పథకం ఫలించి రక్తపాతం జరిగి ఉండేదని జిల్లా పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఆవపల్లి–బసాగుడ్రోడ్డులో బుధవారం స్థానిక పోలీసులు, బాంబ్డిస్పోజల్స్క్వాడ్సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఓ చోట రోడ్డు కింద మందుపాతర ఉన్నట్టుగా బయటపడింది. దాంతో పోలీసులు అక్కడ తవ్వి చూడగా ఎనిమిది అడుగుల పొడవు, అయిదు అడుగుల వెడల్పు గొయ్యి తవ్వి ఇరవై అయిదు కిలోలకు పైగా పేలుడు పదార్థాలను ఉపయోగించి తయారు చేసి ప్లాస్టిక్కంటెయినర్లలో పెట్టిన ఐఈడీ బాంబులు బయటపడ్డాయి. వెంటనే బాంబ్డిస్పోజల్స్క్వాడ్సిబ్బంది వీటిని నిర్వీర్యం చేశారు. మందుపాతరను సకాలంలో కనుక్కోవటం వల్ల పోలీసులను చంపాలన్న మావోయిస్టుల కుట్రను విచ్ఛిన్నం చేసినట్టు బీజాపూర్జిల్లా పోలీసు అధికారులు పేర్కొన్నారు.