శ్రీవారి భక్తులకు భారీ గుడ్ న్యూస్!.. హైదరాబాద్ టు తిరుపతి వన్ డే టూర్ ప్యాకేజీ
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ఏడుకొండల వారిని దర్శించుకోవాలనే కోరిక ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ఏడుకొండల వారిని దర్శించుకోవాలనే కోరిక ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో టైం కుదరకనో లేక రెండు రోజుల ప్రయాణం కోసం సెలవులు దొరక్కనో ఆగిపోతుంటారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణలోని శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెబుతూ ఓ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. తిరుపతికి వన్ డే టూర్ ప్యాకేజీ ప్లాన్ చేసి దానికి సంబందించిన వివరాలను వెల్లడించింది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారిని ఫ్లైట్ లో తిరుపతికి తీసుకెళ్లి స్వామివారి దర్శనంతో పాటు తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేయించి సాయంత్రానికి మళ్లీ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుస్తారు. ఈ తిరుపతి వన్ డే ప్యాకేజీ టూర్ యొక్క పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి
- హైదరాబాద్ లో ఉదయం 6.55 గంటలకు ఫ్లైట్ ఎక్కితే 8 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
- రేణిగుంట నుంచి తిరుపతి హోటల్ కు కారులో తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత తిరుమలకు మళ్లీ కారులో బయల్దేరాలి.
- మద్యాహ్నం ఒంటి గంట సమయానికి తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. అనంతరం తిరుపతి చేరుకుంటారు.
- ఓ గంట విశ్రాంతి తర్వాత తిరుచానూర్ లో పద్మావతి అమ్మవారిని దర్శించుకొని మళ్లీ ఎయిర్ పోర్ట్ కు బయల్దేరాలి.
- సాయంత్రం 6.35 గంటలకు రేణిగుంట నుంచి బయల్దేరి రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ వన్ డే ప్యాకేజీ టూర్ ముగుస్తుంది.
ఇక ఈ తిరుపతి వన్ డే ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి 12 వేల 499 రూపాయలుగా తెలంగాణ టూరిజం శాఖ నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్, కారు ట్రావెల్ చార్జెస్, రెండు చోట్ల ప్రత్యేక దర్శనాలు కవర్ అవుతాయి. దీంతో పాటు తెలంగాణ టూరిజం మరో ప్యాకేజీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రెండు రోజుల తిరుపతి టూర్ ప్యాకేజీ. దీని ధర రూ. 15,499 లుగా ఉంది. ఇక ఈ ప్యాకేజీలకు సంబందించిన పూర్తి వివరాలు www.tourism.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.