ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి
ఖమ్మం మార్కెట్లో మిర్చి పెద్ద ఎత్తున పోటెత్తింది.
దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం మార్కెట్లో మిర్చి పెద్ద ఎత్తున పోటెత్తింది. గత వారం రోజులుగా పెరిగిన ఎండల కారణంగా మిర్చి తోటల్లో పంట రైతు కోయడంతో అవి పూర్తిగా ఎండి గత మూడు నాలుగు రోజులుగా మార్కెట్‌కు 50 వేలకు పైచిలుకు బస్తాలతో మార్కెట్ నిండుతూ వస్తుంది. నేడు 70 వేల బస్తాలు దాటినట్లు వ్యాపారులు చెప్పుకొస్తున్నారు. మార్కెట్ మద్దతు ధర డీలక్స్ రకంనకు రూ.23000 పలుకుతుంది. మామూలు రకం క్వాలిటీ అయితే రూ. 19 వేల నుండి రూ.21 వేల వరకు పలుకుతుందని రైతులు తెలిపారు. ఒక్కసారిగా మిర్చి పెద్ద ఎత్తున మార్కెట్‌కు తరలి రావడంతో రోడ్లపై పదుల సంఖ్యలో వాహనాలు రోడ్డుకి ఇరువైపులా నిలవడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం చోటు చేసుకుంది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురైంది.