ఇంగ్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను తెలంగాణలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు.

Update: 2022-10-04 04:27 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను తెలంగాణలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీ నగరంలో బతుకమ్మ పాటలు మార్మోగాయి. తెలంగాణ బతుకమ్మ అసోసియేషన్‌ ఆఫ్‌ కోవెంట్రీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వినాయక దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలు అలరించాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు కోలాటాలతో సందడి చేశారు. మహిళలు చిన్నారులు బతుకమ్మ ఆడి మురిసిపోయారు. సుమారు రెండు గంటల పాటు అలరించిన బతుకమ్మ వేడుకలలో భారత సంతతికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మ ఆడిన అనంతరం సమీపంలోని కొలనులో నిమజ్జనం చేశారు.



 


Tags:    

Similar News