తొలి రెండు గంటల్లో తెలంగాణ, ఏపీలో పోలింగ్ ఎంత నమోదయిందంటే..?
అసెంబ్లీ, సార్వత్రిక ఎన్ని్కల పోలింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. అయితే తెలంగాణలో తొలి రెండు గంటల్లో 9.48 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ 13.22శాతం, భువనగిరిలో 10.54 శాతం, చేవెళ్లలో 8.29 శాతం, హైదరాబాద్‌లో 5.6 శాతం, కరీంనగర్‌లో 10.23 శాతం, ఖమ్మంలో 12.24 శాతం, మహబూబాబాద్‌లో 11.94శాతం, మహబూబ్‌నగర్‌లో 10.33 శాతం, మల్కాజ్‌గిరిలో 6.20 శాతం, మెదక్‌లో 10.99 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్ కర్నూల్‌లో 9.81 శాతం, జహీరాబాద్ 12.8 శాతం, నల్గొండ 12.8 శాతం, నిజామాబాద్ 10.91 శాతం, పెద్దపల్లిలో 9.53 శాతం సికింద్రాబాద్‌లో 5.40 శాతం, వరంగల్‌లో 8.97 శాతం పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 6.28 శాతం పోలింగ్ నమోదైంది.
ఏపీలో పోలింగ్ పర్సెంటేజ్ ఇలా..
ఏపీలో తొలి రెండు గంటల్లో 10 శాతం పోలింగ్ నమోదైంది. అల్లూరిలో 6.77శాతం, అనకాపల్లిలో 8.37శాతం, అనంతపురంలో 9.18శాతం, అన్నమయ్య జిల్లాలో 9.89 శాతం, బాపట్లలో 11.36 శాతం, చిత్తూరు జిల్లాలో 11.84 శాతం, కృష్ణా జిల్లాలో 10.80 శాతం పోలింగ్ నమోదైంది. కోనసీమలో 10.42 శాతం, తూర్పూ గోదావరి జిల్లాలో 8.68శాతం, ఏలూరులో 9.9 శాతం, గుంటూరులో 6.17 శాతం, కాకినాడలో 7.95 శాతం, కృష్ణాలో 10.80 శాతం, కర్నూలులో 9.34 శాతం, నంద్యాలలో 10.32 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 8.95 శాతం, పల్నాడులో 8.53 శాతం, మన్యం జిల్లాలో 6.30 శాతం, ప్రకాశం జిల్లాలో 9.14 శాతం నమోదైంది. నెల్లూరులో 9.51 శాతం, సత్యసాయి జిల్లాలో 6.92 శాతం, శ్రీకాకుళం 8.30 శాతం, తిరుపతిలో 8.11 శాతం, విజయనగరంలో 8.77 శాతం, పశ్చిమ గోదావరిలో 9.57 శాతం, కడపలో 12.09 శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది.