టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హాలీడే

ఉమ్మడి మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ జిల్లాల్లో సెలవులు ప్రకటించారు.

Update: 2023-03-09 16:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 13న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, 16న కౌంటింగ్ నిర్వహిస్తున్న తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్ ముందు రోజు, పోలింగ్ నాడు, కౌంటింగ్ తేదీన సెలవులను ప్రకటించారు. ఆయా తేదీల్లో అవసరాన్ని బట్టి సెలవు ప్రకటించాలని హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, మహబూబ్‌నగర్, మేడ్చల్- మల్కాజిగిరి, నారాయణపేట, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..