మోడీ రాక వేళ హై టెన్షన్.. పరేడ్ గ్రౌండ్ సభలో కేసీఆర్‌కు ట్విస్ట్

ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన వేళ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపట్టడంతో హై టెన్షన్ నెలకొంది.

Update: 2023-04-08 05:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన వేళ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపట్టడంతో హై టెన్షన్ నెలకొంది. సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ స్టేట్‌లో కోల్ బెల్ట్ ఏరియాలో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ క్యాడర్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, రామగుండం, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో పర్యటనకు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్ కు బీజేపీ పరేడ్ గ్రౌండ్ వేదికగా ట్విస్ట్ ఇచ్చింది. పరేడ్ గ్రౌండ్ సభా వేదికపై కేసీఆర్ కోసం ఆసనం ఏర్పాటు చేసింది. కే. చంద్రశేఖర్ రావు, చీఫ్ మినిస్టర్ రిజర్వ్ డ్ సీటు అని ప్రత్యేకంగా సీటు ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ సీటుకు ఎడమవైపు కేసీఆర్ సీటు ఏర్పాటు చేశారు. 


Tags:    

Similar News