టెన్త్ పేపర్ల లీక్‌పై బండి పిటిషన్.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Update: 2023-04-21 13:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై నమోదైన పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కొట్టివేయాలంటూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాజకీయ దురుద్దేశాలతోనే కావాలనే తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని బండి సంజయ్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.

అర్ధరాత్రి అరెస్ట్ చేసి 150 కిలోమీటర్లు తీసుకెళ్లారని కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్.. ఈ కేసులో బండి సంజయ్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. పేపర్ లీకేజీకి సంబంధించి మార్చి 1 నుంచే కుట్ర జరిగిందని, కేసు దర్యాప్తులో కీలకమైన మొబైల్‌ను బండి సంజయ్ ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలన్న బండి సంజయ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాలు ఎందుకు లీకవుతున్నాయని ప్రశ్నించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి, స్కూల్ హెడ్ మాస్టర్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ జూన్ 16కు వాయిదా వేసింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..