పేద ప్రజలను ఆదుకోండి.. ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల అభ్యర్థన!
రాష్ట్రంలో భారీ వర్షాలతో ఏర్పడిన వరదల కారణంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా అవగాహన కల్పించాలంటూ ఆర్ ఎంపీ, పీఎంపీ సంఘం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాలతో ఏర్పడిన వరదల కారణంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా అవగాహన కల్పించాలంటూ ఆర్ ఎంపీ, పీఎంపీ సంఘం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని జిల్లాల్లోని పీఎంపీ, ఆర్ఎంపీ సంఘాలు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవాలని పిలుపు నిచ్చారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించి, ప్రభుత్వాసుపత్రులకు తరలించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. సీరియస్ గా ఉన్న బాధితులను హైదరాబాద్ ఆసుపత్రుల్లోనూ అడ్మిట్ చేయించాలని, క్షేత్రస్థాయిలో పనిచేసే ఆర్ఎంపీ, పీఎంపీలు ఇందుకు సహకరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, విజ్ఞాన సంఘం నేతలు శంకర్ ముదిరాజ్, బాల బ్రహ్మాచారి, వెంకట్ రెడ్డి, మోహన్, మల్లేశం, బాలరాజులు కోరారు.