Heavy Rains:రెయిన్ అలర్ట్..రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కావున రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.