Heavy Rain: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2023-09-05 03:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక, నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..