Rains: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్

బంగాళఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-08 11:41 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం కారణంగా వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌,జగిత్యాల, భూపాలపల్లి, ఆదిలాబాద్, గద్వాల, కొమురంభీం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అలాగే మెదక్, మంచిర్యాల, మల్కాజ్‌గిరి, నల్గొండ, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్‌ జిల్లా్లో మోస్తారు వర్షాలు, రంగారెడ్డి, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి యాదాద్రి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. గ్రామాలు, మండలాల అధికారులను అప్రమత్తం చేశారు.


Similar News