Heavy Rain: నగరంలో అర్ధరాత్రి దంచికొట్టిన భారీ వర్షం

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిషాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం నుంచి మేఘాలు కమ్ముకుని ముసురు వాతావరణం నెలకొంది.

Update: 2024-08-08 02:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిషాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం నుంచి మేఘాలు కమ్ముకుని ముసురు వాతావరణం నెలకొంది. దీంతో భారీ వర్షం కురుస్తుందని అంతా భావించారు కానీ కురవలేదు. బుధవారం అర్ధరాత్రి ఎవరు ఊహించని రీతిలో ఎటువంటి సరి సప్పుడు లేకుండా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. రాత్రి 12.30 గంటలకు ప్రారంభం అయిన వర్షం దాదాపు 1.30 గంటల వరకు ఎడతెరిపి లేకుండా దంచి కొట్టింది. ముఖ్యంగా ఖైరతాబాద్, సికింద్రాబాద్, అమీర్ పేట, నారాయణగూడ, అంబర్ పేట, ఓయూ, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఈ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. రామ్ నగర్ లోని స్ట్రీట్ నెంబర్ 17 పూర్తిగా జలమయం గా మారిపోయింది. దీంతో యువకులు, స్థానికులు సాహసం చేసి మరి వాహనాలను బయటకు తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే..రాత్రి 11 గంటల సమయంలో కూడా నగరంలోని పాతబస్తీ, కోటీ, దిల్‌షుక్‌నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. కాగా నేడు కూడా నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


Similar News