Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ ఉండటంతో హాయిగా ఎవరి పనిలో వారు నిమగ్నమైన నగరవాసులకు సాయంత్రం వరుణుడు షాకిచ్చారు.

Update: 2024-09-06 11:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ ఉండటంతో హాయిగా ఎవరి పనిలో వారు నిమగ్నమైన నగరవాసులకు సాయంత్రం వరుణుడు షాకిచ్చారు. అనూహ్యంగా భారీ వర్షంతో పరుగులు తీయించాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఉప్పల్, నాంపల్లి, అసెంబ్లీ, మలక్ పేట్, దిల్ సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, కూకట్‌పల్లి, పటాన్ చెరు, అబిడ్స్, కవాడిగూడ, నానక్‌రామ్ గూడలో వర్షం దంచికొడుతోంది. దీంతో పనులన్నీ ఆపేసి.. ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు.


Similar News