బిగ్ అలర్ట్ .. మరో నాలుగు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. (శుక్రవారం) నిన్నటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షం పడుతున్న విషయం తెలిసిందే. వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. రెండు

Update: 2023-08-19 03:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. (శుక్రవారం) నిన్నటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షం పడుతున్న విషయం తెలిసిందే. వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. రెండు, మూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లే అవకాశముంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదిలాబాద్, కుమురంభీమ్‌-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.


Similar News