సీఎం రేవంత్ శిశుపాలుడిలా మారాడు: దాసోజు శ్రవణ్

రేవంత్.. శిశుపాలుడి లా మారాడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. నెగిటివ్ మైండ్ సెట్‌తో ఎందరో కాంగ్రెస్, టీడీపీ నేతల రాజకీయ జీవితాలను రేవంత్ నాశనం చేశాడన్నారు.

Update: 2024-10-30 17:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్.. శిశుపాలుడి లా మారాడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. నెగిటివ్ మైండ్ సెట్‌తో ఎందరో కాంగ్రెస్, టీడీపీ నేతల రాజకీయ జీవితాలను రేవంత్ నాశనం చేశాడన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతోమాట్లాడారు. ప్రకృతి ప్రకోపానికి రేవంత్ గురి కావాల్సిందేనని హెచ్చరించారు. కేసీఆర్ ను ఫినిష్ చేయడం రేవంత్ తరం కాదు ..తస్మాత్ జాగ్రత్త... తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాత పెడుతుందని హెచ్చరించారు. రేవంత్ ది ప్రజా పాలన కాదు.. మూర్ఖపు పాలన.. హిట్లర్ పాలన అన్నారు. రేవంత్ ది దుర్మార్గపు పాలన నా కాదా? తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలంగాణ ప్రజలకు ఆద్యుడిగా ఉండాలన్నారు. దావూద్ ఇబ్రహీం తరహాలో రేవంత్ మాట్లాడుతున్నాడని, క్రిమినల్ సీఎం లా ఉంది రేవంత్ పద్ధతి ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి క్రిమినల్ అయితే ఇక సమాజం ఎట్లా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి...ఈ సీఎంకు గడ్డి పెట్టాలన్నారు.

కాంగ్రెస్ కు రేవంత్ భస్మాసురిడిలా మారాడని, ఆ పార్టీని ఫినిష్ చేసిందే ఆయన అన్నారు. రేవంత్ సమైక్య వాదుల చెప్పులు మోస్తున్నప్పుడు.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తున్నాడన్నారు. కేసీఆర్ పేరు మార్చడానికి గోడ మీద పెయింట్ కాదు ..పెయింటర్ రెడ్డి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఆత్మ కేసీఆర్ అన్నారు. రేవంత్ కూర్చుంటున్న సచివాలయం కేసీఆర్ నిర్మించిందేనన్నారు. కేసీఆర్ శ్రమ లేకుంటే తెలంగాణ ఇంతటి ఉన్నత స్థితిలో ఉండేదా? అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడిగా తన సొంత పార్టీ నేతలను ఫినిష్ చేసిన చరిత్ర రేవంత్ ది అని దుయ్యబట్టారు. నెహ్రూ ను మోడీ అవమానిస్తున్నట్టే రేవంత్ కేసీఆర్ ను అవమానిస్తున్నారన్నారు. హైడ్రా, మూసి, జీవో 46 ,జీవో 29, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఇలా అన్నిటిలో రేవంత్ ది నెగిటివ్ మైండ్ సెట్ అన్నారు. చిల్లర మల్లర చేష్టలు మానుకో రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు. పాలన చేత కాక పిచ్చి మాటలు అని ధ్వజమెత్తారు. అడ్డు అదుపు లేకుండా అహంకారం తో వ్యవహరిస్తే రేవంత్ ను ప్రకృతే చూసుకుంటుందని వెల్లడించారు.


Similar News