హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం

హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం(Heavy Rain) మొదలైంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు మండిపోగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

Update: 2024-10-10 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం(Heavy Rain) మొదలైంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు మండిపోగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి చల్లబడి వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, మాదాపూర్, యూసఫ్‌గూడ, కీసర, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకపూల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, మలక్‌పేట్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్, సికింద్రబాద్‌, ఉప్పల్, రామంతాపూర్, అంబర్ పేట్ ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్లు భారీ ట్రాఫిక్ జామ్ సైతం అయినట్లు తెలుస్తోంది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమై ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు.


Similar News