చీఫ్ ఎలక్టోలర్ ఆఫీసర్‌ కారుపై భారీగా చలాన్లు!

ట్రాఫిక్ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు.. నిబంధనలు పాటించకపోతే వాహనదారుల ముక్కు పిండి మరీ చలాన్లు వసూలు చేస్తారు.

Update: 2023-04-11 11:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు.. నిబంధనలు పాటించకపోతే వాహనదారుల ముక్కు పిండి మరీ చలాన్లు వసూలు చేస్తారు. అయితే, ఈ విషయంలో సామాన్యులకు మాత్రమే చలాన్లా? పొలిటీషియన్లు, అధికారులు రూల్స్ బ్రేక్ చేసినా.. చలాన్లు చెల్లించక్కర్లేదా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన ప్రతి ఒక్కరికీ చలాన్లు విధిస్తుండగా.. అందులో అధికారులు కూడా ఉంటుండటం విశేషం. ఈ క్రమంలోనే తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కారుపై ఉన్న చలాన్ల చిట్టా బయటపడింది. ఆఫీసర్ కారుపై భారీగా చలాన్లు ఉన్నా వాటిని కట్టడం లేదని, ఇందుకు సంబంధించిన ఫోటోలను నెటిజన్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు.

ఆఫీసర్ కారుపై ఏకంగా 18 చలాన్లు ఉండడం గమనార్హం. మితిమీరిన వేగం, నో పార్కింగ్ వద్ద పార్కింగ్ చేయడం వంటి రూల్స్ బ్రేక్ చేసినందుకు భారీగా ఫైన్లు పడ్డాయి. అయితే, ఇందులో ఎక్కువగా ఓవర్ స్పీడ్‌కు సంబంధించిన చలానాలే ఉండటం గమనార్హం. 18 చలాన్లు విధించగా.. మొత్తం 18,630 రూపాయలుగా తేలింది. వీటిని ఆఫీసర్ కట్టకపోయినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు చలాన్లు కట్టకపోతే మాత్రం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.. కానీ, పొలిటీషియన్లు, అధికారుల విషయంలో మాత్రం ఇవేం చెల్లవా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News