కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ పోస్టు దరఖాస్తు గడువు పెంపు

కాళోజీ హెల్త్‌ వర్సిటీ వీసీ పోస్టుకు దరఖాస్తు గడువును వైద్యారోగ్య శాఖ పొడిగించింది. జూలై 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు

Update: 2024-06-21 16:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ హెల్త్‌ వర్సిటీ వీసీ పోస్టుకు దరఖాస్తు గడువును వైద్యారోగ్య శాఖ పొడిగించింది. జూలై 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. సచివాలయంలోని ఆరోగ్యశాఖ కార్యదర్శికి రిజిస్టర్‌ పోస్టులో పంపాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి కొత్త వీసీని భర్తీ చేసేందుకు ఈ నెల 7 వ తేదిన ఆరోగ్యశాఖ ఓ నోటిఫికేషన్ ఇచ్చింది.

ఈ నెల 22 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను స్వీకరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే మొదట ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ రోజుతో ముగియనున్న గడువును అధికారులు పొడిగించారు. అయితే మెడికల్ ఫీల్డ్ లో ఉంటూ డీన్ గా కనీసం రెండేళ్లు, ప్రిన్సిపాల్ గా పదేళ్లు అకాడమిక్ అనుభవం కలిగినోళ్లు అర్హతగా పరిగణిస్తారు. 67 ఏళ్లు నిండని వాళ్లు మాత్రమే ఈ పోస్టుకు అర్హతగా హెల్త్ సెక్రటరీ గతంలోనే ఉత్తర్వులు రిలీజ్ చేశారు. 


Similar News