చట్నీలో ఎలుక ఘటనపై ఆరోగ్య మంత్రి ఆగ్రహం.. రాష్ట్రంలో హాస్టళ్లు తనిఖీ చేయాలని ఆదేశం

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంటీన్‌లో చట్నీలో ఎలుక వచ్చిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-07-09 11:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంటీన్‌లో చట్నీలో ఎలుక వచ్చిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎన్టీయూలో జరిగిన ఘటనపై తక్షణం విచారణ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక ఆర్డీఓ, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టి వెంటనే నివేదిక ను సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.

అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాల్లో ఉన్న బోర్డింగ్, హాస్టళ్లను, క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహాకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి కోరారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్, హాస్టల్స్, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకుల పై నిఘా ఉంచాలని మంత్రి అధికారాన్ని ఆదేశించారు.

Tags:    

Similar News