కోర్సు హోమియోపతి.. వైద్యం అల్లోపతి
హోమియోపతి కోర్సులు చేసి చాలా మంది అల్లోపతి వైద్యం అందిస్తున్నారని, దీనిపై టీఎస్ మెడికల్‌కౌన్సిల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నదని హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్అసోసియేషన్ కోరింది.
దిశ, తెలంగాణ బ్యూరో: హోమియోపతి కోర్సులు చేసి చాలా మంది అల్లోపతి వైద్యం అందిస్తున్నారని, దీనిపై టీఎస్ మెడికల్‌కౌన్సిల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నదని హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్అసోసియేషన్ కోరింది. ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న అనర్హ వైద్యులను చికిత్స అందించేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని శనివారం టీఎస్ మెడికల్ కౌన్సిల్‌కు హెచ్ఆర్డీఏ ఫిర్యాదు చేసింది.
ఏవీఎస్ పారామెడికల్ ఇనిస్టిట్యూట్, సాధు హాస్పిటల్స్‌లో హోమియోపతి వైద్యం అందించాల్సి ఉండగా.. అల్లోపతి వైద్యాన్ని అందిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని కంప్లైంట్లో పేర్కొన్నారు. నిజామాబాద్, నిర్మల్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలలో ఆయా సంస్థలకు ప్రత్యేక బ్రాంచ్‌లు ఉన్నాయని, వాటిపై కూడా ఎంక్వైరీ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డా.మహేష్ ప్రభుత్వాన్ని కోరారు.