హెడ్​ కానిస్టేబుల్​ కుటుంబానికి బ్యాచ్​ మేట్ల చేయూత

చనిపోయిన హెడ్​ కానిస్టేబుల్​ కుటుంబానికి అతని బ్యాచ్​ మేట్లు అండగా నిలిచారు. తలా కొంత మొత్తం పోగేసి మరణించిన స్నేహితుని కుటుంబానికి 2 లక్షల 45 వేల 225 రూపాయల చెక్కును సైబరాబాద్​ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా అందించారు.

Update: 2023-07-12 16:16 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: చనిపోయిన హెడ్​ కానిస్టేబుల్​ కుటుంబానికి అతని బ్యాచ్​ మేట్లు అండగా నిలిచారు. తలా కొంత మొత్తం పోగేసి మరణించిన స్నేహితుని కుటుంబానికి 2 లక్షల 45 వేల 225 రూపాయల చెక్కును సైబరాబాద్​ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా అందించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ పని చేస్తున్న అశోక్​ వర్ధన్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా చనిపోయాడు. ఈ క్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (సైబరాబాద్, రాచకొండ, నిజామాబాద్) 2000వ సంవత్సరం బ్యాచ్​ హెడ్ కానిస్టేబుళ్లు తమ వంతుగా డబ్బును విరాళాల రూపంలో జమ చేసి అశోక్​ వర్ధన్ చంద్రకళకు అందించారు.

దాంతోపాటు మరణానంతరం వచ్చే బెనిఫిట్స్ ను వీలైనంత త్వరగా అశోక్​ వర్ధన్ కుటుంబానికి అందేలా చూడాలని కమిషనర్​ స్టీఫెన్ రవీంద్రకు విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులకు ఏ అవసరమైనా తామున్నామంటూ భరోసానిచ్చారు. కార్యక్రమంలో అశోక్​ వర్ధన్ పిల్లలు సుజన్, సంజన, బ్యాచ్​ మేట్స్ శ్రీనివాస్, సత్తయ్య, వెంకటేశ్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, కోశాధికారి మల్లేశం, రాష్ర్ట ఉపాధ్యక్షుడు కరుణాకర్​ రెడ్డి, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..