డ్యూటీలకు రారు.. జీతాలు మాత్రం తీసుకుంటారు
“డ్యూటీలకు హాజరు కాకపోయినా.. కొందరు స్టాఫ్ జీతాలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ఇనిస్టిట్యూట్ పీవీటీజీ జూనియర్‌కాలేజీ హయత్ నగర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: “డ్యూటీలకు హాజరు కాకపోయినా.. కొందరు స్టాఫ్ జీతాలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ఇనిస్టిట్యూట్ పీవీటీజీ జూనియర్‌కాలేజీ హయత్ నగర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. ఇతర కాలేజీల నుంచి ఈ కాలేజీ ఆఫ్ఎక్స్లెన్స్కి డిప్యూటేషన్‌కు వచ్చి.. విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. ఓ డీపీవో కళాశాలకు రాకపోయినా అటెండెన్స్‌లో వచ్చినట్లు చూపించి జీతాలు క్లైమ్చేశారని మాసాబ్ ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ముఖ్య కార్యాలయానికి కంప్లైంట్ చేరింది. సుమారు మూడు నెలల సాలరీ లిప్ట్ చేసినట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో కంగుతిన్న ఆఫీసర్లు.. ఎంక్వైరీ వేయాలని భావిస్తున్నారు.’’
రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలో కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు సెంటర్లు మూడు ఉన్నాయి. ఆసీఫాబాద్ లో ఒకటి, రెండు హయత్ నగర్ పరిధిలో నిర్వర్తిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో కొంత మంది టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్లు డిప్యుటేషన్ విధానంలో ఈ ఎక్స్‌లెన్స్ కేంద్రాల్లో పని చేస్తున్నారు. వీరిలో కొందరు కాలేజీలకు రాకపోయినా.. అటెండెన్స్చూపించి జీతాలు క్లైమ్చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ విధానంలో వచ్చిన కొందరు స్టాఫ్ జీతాలు తీసుకున్నట్లు ఇప్పుడు మాసాబ్ ట్యాంక్ కార్యాలయంలో చర్చ జరుగుతున్నది. కొందరు ప్రిన్సిపాళ్లు, ఆర్సీ ల చొరవతోనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు అనుమానం ఉన్నది. దీంతో కాలేజీల ఆఫ్ఎక్స్లెన్స్సెంటర్లతో పాటు ట్రైబల్ వెల్ఫేర్పరిధిలోని అన్ని కాలేజీలలో ఎంక్వైరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.