అంబేద్కర్ జయంతికి హడావిడిగా ఏర్పాట్లు.. ఐమాక్స్ పక్కన భారీ సభ
ఈ ఏడాది అంబేద్కర్జయంతి వేడుకలను మరింత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోన్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది అంబేద్కర్జయంతి వేడుకలను మరింత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోన్నది. అంబేద్కర్ విగ్రహం వద్ద హాడావిడిగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐ మాక్స్థియేటర్పక్కన ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్‌విగ్రహం ఆవిష్కరణ అనంతరం ప్రత్యేక మీటింగ్జరగనున్నది. చీఫ్‌గెస్ట్‌గా అంబేద్కర్మనవడు ప్రకాష్అంబేద్కర్, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్చైర్మన్లు, దళిత సంఘాల ముఖ్యనాయకులు, ప్రతినిధులు, మేధావి వర్గం ప్రతినిధులు ఇలా సుమారు 50 వేల మంది హజరయ్యే ఛాన్స్ఉన్నది. గ్రేటర్‌హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల నుంచి దళిత నాయకులు ఈ సభకు రానున్నారు. ఈ మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
విగ్రహంతో మార్కులు...
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువు దీరనుంది. 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన విగ్రహంతో పాటు రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెన్, సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర పనులను మంత్రి మరోసారి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ భారీ విగ్రహాం ఏర్పాటుతో దళిత వర్గాల్లో సర్కార్ మంచి పేరును పొందేలా కార్యచరణను రూపొందించింది. ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్‌విగ్రహం కావడంతో దళిత వర్గాలన్నీ ప్రభుత్వానికి మద్ధతు పలుకుతాయనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్నాయకులు భావిస్తున్నారు.