'హస్తినకు ఎంపీ లక్ష్మణ్'.. ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం

రాష్టంలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా జాతీయ అధినాయకత్వం దృష్టిసారించింది.

Update: 2023-06-30 16:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్టంలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా జాతీయ అధినాయకత్వం దృష్టిసారించింది. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు నేతలను ఢిల్లీకి పిలిచిన హైకమాండ్ తాజాగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ను హస్తినకు రావాలని ఆదేశించింది. దీంతో ఆయన హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో జరగనున్న కీలక సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ప్రధాని మోడీ, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సైతం ఈ సమావేశాంలో పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

వారితో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల జాతీయ అధ్యక్షులు సైతం పాల్గొననున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ కు జాతీయ నాయకత్వం నుంచి పిలుపు రావడంతో ఆయన ఉన్నపళంగా హస్తినకు పయనమయ్యారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో పలు కీలక అంశాలు లక్ష్మణ్‌తో చర్చించే అవకాశముందని సమాచారం. అంతేకాకుండా కొద్దిరోజులుగా టీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపైనా ఆరా తీసే అవకాశముందని టాక్.


Similar News