ఇక్ఫాయి కళాశాలను సందర్శించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ..

హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇక్ఫాయి కళాశాలను సందర్శించారు.

Update: 2023-04-27 13:37 GMT

దిశ, శంకర్పల్లి: హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇక్ఫాయి కళాశాలను సందర్శించారు. దొంతాన్ పల్లి లోని ఇక్ఫాయి కళాశాలకు గురువారం ఆయన రాగా కళాశాల ఉపకులపతి స్వాగతం పలికారు. అనంతరం ఆయన విద్యా విభాగపు అధిపతులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు నూతన ధోరణుల గురించి వివరించాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో నూతన సవాళ్లు ఎదురవుతున్నాయని , వాటికనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. అనంతరం ఆయన కళాశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..