ఒకే స్టేజ్‌... ఒకే అంశం.. కిషన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ మధ్య మాటలయుద్ధం

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహించారు. ..

Update: 2024-10-13 10:20 GMT

దిశ, వెబ్ డెస్: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Haryana Governor Bandaru Dattatreya) ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌(Hyderabad Nampally Exhibition Grounds)లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం(Alay Balay programme) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, ప్రముఖులు పాల్గొన్నారు. రాజకీయ నాయకుల భాషపై ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులు విమర్శించుకోవాలని, కానీ ప్రజలు అసహ్యించుకునేలా కాదన్నారు. నాయకులు మాట్లాడే తీరుతో పాటు భాషలోనూ మార్పు రావాలని ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ఘర్షణ పడొచ్చని, కానీ ఆ తర్వాత అంతా మర్చిపోయి ప్రజల శ్రేయస్సును కోరుకోవాలని సూచించారు. ప్రస్తుతం పార్టీలు విమర్శించుకుంటున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు

అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో భాష ముఖ్యమని, కానీ వేరేవాళ్లకు ఇబ్బంది కలిగింకూడదని చెప్పారు. కొందరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అలాంటి వారికి స్వీయ నియంత్రణ ఉండాలని బీజేపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడేలా దత్తాత్రేయ చొరవ చూపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. 


Similar News