జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌పై హరీష్ రావు సెన్సేషనల్ కామెంట్స్

ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి

Update: 2024-06-18 13:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహా రెడ్డి పవర్ కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు హాజరుకాకముందే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్‌పై అబాంఢాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే పవర్ కమిషన్ నుండి జస్టిస్ నర్సింహా రెడ్డి విచారణ నుండి స్వచ్ఛదంగా వైదొలగాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ అప్పటి సీఎం కేసీఆర్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులకు కేసీఆర్ ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు. జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ విచారణ సరిగ్గా జరపడం లేదని, కమిషన్‌ను నుండి జస్టిస్ నర్సింహా రెడ్డి తప్పుకోవాలని కేసీఆర్ అన్నారు. తాజాగా హరీష్ రావు సైతం అవే కామెంట్స్ చేశారు. 

Tags:    

Similar News