సిద్దిపేట నుంచి ఉడత భక్తిగా వరద బాధితులకు సహాయం చేస్తున్నాం: హరీష్ రావు

బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఖమ్మం వరద బాధితులకు సరకులను వాహనాల ద్వారా పంపారు.

Update: 2024-09-05 08:16 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఖమ్మం వరద బాధితులకు సరకులను వాహనాల ద్వారా పంపారు. ఇటీవల ముడు రోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో సిద్దిపేట నుంచి ఉడత భక్తిగా సరుకుల సాయం చేస్తున్నామని హరీష్ రావు చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్లపై రాళ్లదాడిపై హరీశ్ రావు స్పందిస్తూ.. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరని అన్నారు.

రాష్ట్రంలో ప్రజా పాలన కాదు రాక్షస పాలన నడుస్తోందని..వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని.. ప్రభుత్వం ముందుగా మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని..మా తరహాలో బీజేపీ మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. అలాగే వరదల్లో ఇండ్లు నీళ్లలో మునిగి పోయిన వారికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు.


Similar News