Harish Rao : శ్రీతేజను పరామర్శించిన హరీష్ రావు

సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Stampede) ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను బీఆర్ఎస్ నేత హరిశ్ రావు(Harish Rao) పరామర్శించారు.

Update: 2024-12-26 12:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Stampede) ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను బీఆర్ఎస్ నేత హరిశ్ రావు(Harish Rao) పరామర్శించారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాలుడికి అందుతున్న వైద్య సహాయం గురించి తెలుసుకున్నామని అన్నారు. బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చమని కేసీఆర్(KCR) తమని ఆదేశించారని అన్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నామన్నారు. తొక్కిసలాటలో మరణించిన రేవతికి తమ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు.

సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు స్పందించారని, అప్పటిదాకా ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనను అసెంబ్లీలో ప్రస్తావించి రాజకీయం చేసింది ఎవరో ప్రజలు చూస్తున్నారని వెల్లడించారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదని మండిపడ్డారు. గురుకులాల పిల్లల తల్లుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదన్నారు. సినిమా వాళ్ళని భయపెట్టి మంచి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. శ్రీతేజను పరామర్శించిన వారిలో హరీష్ రావుతోపాటు, వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. 

Tags:    

Similar News