Harish Rao: విపక్షాలను టార్గెట్ చేయడం మంచిది కాదు.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

ప్రభుత్వం విపక్షాలను టార్గెట్ చేయడం మంచిది కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Update: 2024-08-29 12:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం విపక్షాలను టార్గెట్ చేయడం మంచిది కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చడం కరక్టేనని.. కానీ బుద్ధ భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయాలు కూడా నాలాపై ఉన్నాయని ముందు వాటిని కూలగొట్టాలని సవాల్ విసిరారు. అదేవిధంగా నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్క్, హోటళ్లు, క్లబ్‌లు దేని కింద ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇకపోతే మీర్ ఆలం, ఉప్పల్, రామాంతపూర్ చెరువుల్లో ఆకాశాన్నంటేలా టవర్లు ఉన్నాయని వాటి సంగతేంటో చెప్పాలన్నారు. అవన్నీ కాకుండా తమ ఎమ్మెల్యే రాజశేఖర్‌ రెడ్డి భవనాలను ఎలా కూలగొడలతారని అన్నారు. ఇప్పటికే ఆక్రమ నిర్మాణాల పేరుతో చాలా ఇళ్లను నేలమట్టం చేశారని, అందులో పట్టా భూములున్నాయని.. వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీల ఫామ్ హౌజ్‌ల నుంచి వచ్చే డ్రైనేజీ నీళ్లతో చెరువులు కలుషితం అవుతున్నాయని అన్న సీఎం.. నేడు మంత్రి పొంగులేటి నివాసం నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ ఎక్కడి వెళ్తున్నాయో చెప్పాలన్నారు. అంటే ముఖ్యమంత్రి పరోక్షంగా తన మంత్రినే తిడుతున్నారా అని సెటర్లు వేశారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం ఇకనైనా మానుకోవాలని.. చిత్తశుద్ధి ఉంటే హైడ్రా పరిధిలోని ఆక్రమణలు కూల్చివేయాలని అన్నారు. అదేవిధంగా చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లు, నాలలపై ఉన్న ఆస్తులన్నింటి కూల్చివేయాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం మరమ్మతుల విషయంలో తనకే అవకాశం ఇస్తామన్నారని.. తాను అందుకు సిద్ధపడితే సీఎం రేవంత్‌రెడ్డి తోక ముడిచారని ఎద్దేవా చేశారు.


Similar News